Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll: నలుగురి పేర్లు పీసీసీకి పంపిన ఎన్నికల కమిటీ

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఈ నెలాఖరు తర్వాత ప్రకటించనున్నట్టుగా పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ ప్రకటించారు.నలుగురి పేర్లను పీసీసీకి సిఫారసు చేసినట్టుగా దామోదర రాజనర్సింహ తెలిపారు.

Huzurabad bypoll: Congress election committee recommands four names for contesting in Huzurabad
Author
Karimnagar Bus stand, First Published Sep 28, 2021, 4:16 PM IST

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి (huzurabad bypoll) జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఈ నెల 30వ తేదీ తర్వాత ప్రకటిస్తామని పీసీసీ (pcc)ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ (damodara raja narasimha) చెప్పారు.

also read:Huzurabad bypoll: 'ఆ రెండు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్'

అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆశావాహుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించింది. 19 మంది ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపారు.ఈ మేరకు పీసీసీకి ధరఖాస్తు చేసుకొన్నారు.

ఈ ధరఖాస్తులను పరిశీలించిన  ఎన్నికల కమిటీ పీసీసీకి నలుగురి పేర్లను సిఫారసు చేసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి 19 మంది పేర్లను వడపోసి నలుగురి పేర్లను పీసీసీకి పంపింది.సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లను పీసీసీకి ఎన్నికల కమిటీ సమర్పించింది. ఈ నెల 30వ తేదీ తర్వాత భూపాలపల్లిలో సభ తర్వాత హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించనున్నట్టుగా దామోదర రాజనర్సింహ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios