హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ స్థానం నుండి పోటీకి దింపే అభ్యర్ధిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ స్థానం నుండి పోటీపై అభిప్రాయం తెలపాలని కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరింది. కొండా సురేఖ పోటీకి విముఖత చూపితే  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని ఈ స్థానం నుండి  బరిలోకి దింపనుంది కాంగ్రెస్.

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలపై (Huzurabad bypoll)కాంగ్రెస్ పార్టీ ఫోకస్ (congress )పెట్టింది.ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపికపై ఆ పార్టీ కసరత్తును ప్రారంభించింది.ఈ స్థానం నుండి మాజీ మంత్రి కొండా సురేఖను(konda surekha) బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ స్థానం నుండి పోటీ చేసే విషయమై తన అభిప్రాయం తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ కొండా సురేఖను కోరింది. కొండా సురేఖ నిర్ణయం ఆధారంగా అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేయనుంది.

also read:Huzurabad bypoll: ఇతర పార్టీలతో సమన్వయంతో వెళ్తామన్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్ (manickam tagore)ఇవాళ హైద్రాబాద్ కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హైద్రాబాద్‌లో ఉంటారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై ఠాగూర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.

ఈ స్థానం నుండి పోటీ చేయడానికి 19 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఇందులో నలుగురు పేర్లను పీసీసీ ఎన్నికల కమిటీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నివేదికను అందించింది. కొండా సురేఖను హుజూరాబాద్ నుండి బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపాలని భావిస్తోంది. కొండా సురేఖ ఈ స్థానం నుండి పోటీకి విముఖత చూపితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొండా సురేఖ కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు 3 టికెట్లు ఇవ్వాలని కొండా సురేఖ కాంగ్రెస్ నాయకత్వం కోరినట్టుగా సమాచారం.