అక్టోబర్ 2 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై  రోజూ వారీ పోరాటం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ పోరాట కార్యక్రమాలుంటాయన్నారు.ఈ కార్యక్రమానికి విద్యార్ధి నిరుద్యోగ సైరన్ అనే పేరు పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (huzurabad bypoll )ఇతర పార్టీలతో సమన్వయం చేసుకొంటామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పారు.మిగిలిన పక్షాలను కూడా కలుపుకుని పోతామని ఆయన అన్నారు. బుధవారం నాడు ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

ప్రజా సమస్యలపై అక్టోబర్ 2వ తేదీ నుండి రోజూవారీ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోకేసీఆర్ (kcr) మళ్లీ రాచరిక పాలనను తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9 వ తేదీ వరకు పోరాటం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

విద్యార్ధి నిరుద్యోగ సైరన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మళ్లీ రాచరిక పాలనను తీసుకొస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.