Asianet News TeluguAsianet News Telugu

Huzurabad bypoll:కేసీఆర్ భరతం మేం పడతాం... బేఫికర్ బిడ్డా: ఈటలకు మహిళల భరోసా

హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తాను ఓ మహిళతో జరిపిన ఆసక్తికర సంబాషణ గురించి వెల్లడించారు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్. కేసీఆర్ భరతం మేం పడతాం... బేఫికర్ బిడ్డా అని ఆ మహిళ భరోసా ఇచ్చినట్లు ఈటల తెలిపారు.   

huzurabad bypll... eatala rajender election campaign at kamalapur
Author
Huzurabad, First Published Oct 6, 2021, 4:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికలో గెలవాలని అధికార టీర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ తనకు అవమానించిన TRS పార్టీని ఓడించి కాషాయ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ఈ క్రమంలోనే బుధవారం తన సొంత మండలమైన కమలాపూర్ లోని గుండేడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు eatala rajender. ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఈటల వారితో సరదాగా ముచ్చటించారు. 

''నీకు దగ్గర ఉన్నవాళ్లు, నీ సొమ్ము తిన్నవాల్లు, నువ్వు అధికారం ఇచ్చిన వాళ్ళు  అందరూ  వెళ్లి పోయారని మీరు అంటున్నారు... అది నిజమే. అయితే పోయిన వాళ్ళు పోయారు.... ఇక మీరే నన్ను కాపాడాలి, అండగా ఉండాలి'' అని మహిళలను కోరారు ఈటల.

''కొత్తపల్లిలో ఒక అమ్మ మాట్లాడుతూ నువ్వే గెలుస్తావు బిడ్డా అని అన్నది. నేను కాదు అమ్మ... మీరు గెలిపిస్తే గెలుస్తా అన్నాను. మేమే తప్పకుండా గెలిపిస్తం అని చెప్పింది. కేసిఆర్ డబ్బులు పంపిస్తున్నారు, దాడి చేయించబట్టే, రోజుకో దొంగ ఉత్తరం, కరపత్రం, ప్రెస్ మీట్ పెట్టబట్టే ఎలా అమ్మ అని నేను అంటే... ఆ కేసిఆర్ భరతం మేము పడతాం... నువ్వు బేఫికర్ ఉండు బిడ్డా అని చెప్పింది'' అని తెలిపారు ఈటల. 

వీడియో

''ఇక ఉప్పల్ లో ఒక గౌడన్న బండి మీద నా ఫోటో, బండి సంజయ్ ఫోటో పెట్టుకుంటే చూసి ఒక పోలీసు కేసు పెడతానని బెదిరించాడ. కానీ అతడు బయపడకుండా పెట్టుకోమని చెప్పాడు. ఇలా ఈటెల రాజేందర్ ఫోటో పెట్టుకోవటానికి కూడా అధికారం లేకుండా కేసిఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఎంత దుర్మార్గం,ఎంత అహంకారం. గమనించండి. ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే సీఎం అయ్యాక అయన చేస్తున్న నిర్వాకం ఏంటో చూడండి'' అన్నారు. 

read more  Huzurabad Bypoll: మంత్రులు హరీష్, గంగులను సైతం వదలని పోలీసులు

''పెనుగులాట జరుగుతుంది... ఏం చేసినా నా వెంట ఉంట అని ప్రజలు వస్తున్నారు. నేను ఏ ఊరు పోయినా కరెంటు ఫీజు పీకిస్తుండు కేసీఆర్... దీన్ని గమనిస్తున్న మీరు అయన అధికారం ఫీజు పీకే రోజు 30వ తేదీయే. గుర్తుంచుకొండి'' అని పేర్కొన్నారు. 

''టీఆర్ఎస్ వాళ్ళ ప్రేమ 30 రోజులే... నా ప్రేమ శాశ్వతం. మేము పైసలతో కాదు ప్రేమతో గెలుస్తాం. కేసిఆర్ డబ్బులు, సీసాలు, అధికారులకు, అహంకారాన్ని ఓడగొట్టే రోజు 30వ తేదీ. ఊరంతా ఒక్క ఓటు కూడా పక్కకు పోవద్దు'' అని సూచించారు. 

''ఊరంతా ఒకదారి ఊసర వెళ్లిది ఒక దారి అన్నట్టు కొంత మంది ఉంటారు... వాళ్ళ గురించి మాట్లాడితే మన నోరు కరాబ్ అవుతుంది. ఇప్పుడు ఎగిరి ఎగిరి మాట్లాడుతున్నవారు ఈటెల రాజేందర్ ఏం తప్పు చేశాడని కేసిఆర్ ను అడగాలి కదా. అయినా నన్ను తిట్టినొడు ఎవరూ బాగు పడరు'' అని ఈటల హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios