హుస్సేన్ సాగర్ నిండిపోయింది భారీ వర్షాలతో సాగర్ లోకి పెరుగుతున్న నీటిప్రవాహం లోతట్టు ప్రాంతాల ప్రజల ఆందోళన

సాగర్ ఫుల్ అయింది

తెలంగాణలో ఏకదాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రం తడిసి ముద్దవుతోంది.  వరదనీరు  హుసేన్ సాగర్ జ‌లాశ‌యంలో చేరుతోంది. దీంతో  నీటిమ‌ట్టం గంట గంటకు పెరిగి సాగర్ నిండుతున్నది.  

ప్రస్తుతం సాగర్‌ లోకి ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులుగా నమోదయింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో  సాగర్ నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో  అప్రమత్తమైన అధికారులు సాగర్ తూముల ద్వారా నీటిని  దిగువకు వదులుతున్నారు.

భారీ వ‌ర్షాలు కురిస్తుండటంతో ట్యాంక్ బండ్ దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే సాగర్ నీటిని బయటకు వదులుతుండటంతో నాలాల పక్కనున్న ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.