గర్భిణి భార్యను ఈ శాడిస్ట్ భర్త ఏం చేశాడో తెలుసా?

husband tortured his wife with heat iron box
Highlights

గదిలో బంధించి, ఐరన్ బాక్సుతో కాల్చి

మానవత్వాన్ని మరిచిన ఓ కిరాతకుడు అదనపు కట్నం కోసం తరన భార్యను చిత్రహింసలపాలు చేసిన విషాద సంఘటన హైదరాబాద్ లంగర్ హౌజ్ లో చోటుచేసుకుంది. పాపం...ఆమె వట్టి మనిషి కూడా కాదు, ఐదునెలల గర్భిణి. అయినా కూడా దయతల్చకుండా గదిలో బంధించి సలసలమంటున్న ఐరన్ బాక్స్ తో శరీరంపై కాల్చాడు. అయితే భర్త చేతిలోంచి తప్పించుకున్న భార్య తల్లిదండ్రులు సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ శాడిస్టు భర్త పైశాచికం బైటపడింది.
  
వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలి అంజయ్యనగర్‌కు చెందిన ప్రశాంత్ కుమార్‌కు షేక్‌పేటకు చెందిన జ్ఞాన పుష్ప జ్యోతితో 2012 లో పెళ్లి జరిగింది.  ప్రశాంత్ వెబ్ డిజైనర్ గా ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తాడని చెప్పి జ్యోతి తల్లిదండ్రులను నమ్మించి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన నాటి నుండి ప్రశాంత్ జులాయిగా తిరుగుతున్నాడు. అఫ్జల్‌గంజ్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ భార్య సంపాదిస్తుంటే ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు.

 జ్యోతి తల్లి విద్యాఖాఖలో ఉద్యోగం చేస్తూ గత సంవత్సరం డిసెంబర్ లో రిటైరయ్యింది. అప్పటినుండి తల్లికి వచ్చిన రిటైర్ మెంట్ డబ్బులను తీసుకురావాలని ప్రశాంత్ భార్యను వేదించసాగాడు. అయితే ఇతని వేధింపులు గత రెండు రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి. 

రెండు రోజులుగా భార్య జ్యోతిని ఇంట్లో కాళ్లు చేతులు కట్టేసి ప్రశాంత్ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు. బాగా వేడెక్కిన ఐరన్ బాక్సుతో చేతులు, మెడపై కాలుస్తూ పైశాచికానందం పొందాడు. ఈ హింసలు భరించలేక భర్త నుండి తప్పించుకున్న జ్యోతి నేరుగా షేక్‌పేటలోని తన తల్లిగారింటికి చేరుకుని జరిగిన విషయాన్ని వారికి తెలిపింది. దీంతో వీరంతా కలిసి లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌ కు చేరుకుని ప్రశాంత్ పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 

loader