హైదరాబాద్ శేరిలింగంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు గాయపడ్డారు. బాదం మిల్క్ షేక్ తయారు చేస్తున్న గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ శేరిలింగంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. శేరిలింగంపల్లి రైల్ విహార్‌లోని ఓ గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అక్కడి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.30 గంటలకు గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా డయల్ 100కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారని, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని చెప్పారు.
బాధితులు రాజస్థాన్‌కు చెందినవారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్‌కు వచ్చి శేరిలింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. బాదం మిల్క్ షేక్ తయారు చేస్తున్న గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
