వివాహేతర సంబంధం: భార్యను సజీవదహనం చేసిన భర్త

Husband kills wife in warangal rural district
Highlights

భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. అయినా ఆ భార్య సహించింది. కానీ ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకుని అతడు వేరే మహిళలతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. తాగుతూ జులాయిగా తిరిగినా పల్లెత్తి మాట అనని భార్య భర్త అక్రమసంబంధాల గురించి తెలిసి తట్టుకోలేకపోయింది. ఇదేంటని భర్తను ప్రశ్నించింది. అయితే భార్య ఇలా నితదీయడాన్ని భరించలేని అతడు భార్య చేతులూ, కాళ్లు కట్టేసి కిరోసిన్ పోసి అత్యంత దారుణంగా సజీవ దహనం చేశాడు. 

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో బానోతు బాలు-రజిత దంపతులు నివాసముంటున్నారు. వీరికి గోపాల్, చరణ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. అయితే మద్యానికి బానిసైన బాలు ఎప్పుడూ తాగుతూనే ఉంటూ జులాయిగా తిరిగేవాడు. కుటుంబ పోషణను గాలికొదిలేసాడు. దీంతో రజిత కూలీ పనులకు వెలుతూ కుటుంబాన్ని పోషించేది.

భార్య కూలీ డబ్బులను కూడా తీసుకుని బాలు తాగడానికి ఉపయోగించేవాడు. ఈ క్రమంలో అతడికి వేరే మహిళలతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్య రజిత ఈ అక్రమ సంబంధాల గురించి భర్తను ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించడమే ఆమె పాలిట శాపమైంది. రజిత రాత్రి సమయంలో నిద్రిస్తుండగా ఆమె చేతులు, కాళ్లు కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవంగానే దహనం చేశాడు. మంటలకు తాళలేక రజిత గట్టిగా కేకలు వేయడంతో తండావాసులు మేల్కొన్నారు.  వెంటనే మంటలు ఆర్పి చికిత్స కోసం వరంగల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే 95 శాతం కాలిన గాయాలతో రజిత చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఈ ఘటనపై రజిత తల్లిదండ్రుల ఫిర్యాదు పోలీసులు బాలుపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకెళ్లడంతో పిల్లలిద్దరు అనాధలుగా మారారు. 

loader