అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లిద్దరూ చాలాలేదన్నట్లు మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నించినందుకు కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది.

Also Read మానసిక వికలాంగురాలిపై కన్నేసిన కామాంధుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదాశివనగర్ మండలం సజ్జ్యనాయక్ తండాకు చెందిన శివరాం కి ఇద్దరు భార్యలు. వీరిద్దరితో కాపురం చేసి పిల్లలను కూడా కన్నాడు. అక్కడితో ఆగకుండా రెండు నెలలగా మరో మహిళ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఈ విషయం అతని ఇద్దరి భార్యలకు తెలిసిపోయింది. మొదటి భార్య సర్దుకుపోగా.. రెండో భార్య మాత్రం చూస్తూ ఊరుకోలేదు. దీంతో... శివరాం రెండో భార్య మేనక(38) ఈ విషయంలో భర్తను నిలదీసింది. మరో మహిళతో ఎందుకు బంధం పెట్టుకున్నావంటూ ప్రశ్నించింది.

అయితే.. భార్య ఇలా ప్రశ్నించడంతో శివరాం కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ఓకర్ర తీసుకొని భార్య తలపై కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమై రక్త స్రావమైంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.