ఆమె అందరిలా నడవలేదు.. కనీసం మెదడు కూడా పెరగలేదు. అలాంటి వాళ్లను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అలాంటి యువతిపై ఓ కామాంధుడు.. తన కోరిక తీర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన  వరంగల్ జిల్లా రాయపర్తిలో చోటుచేసుకుంది.

Also Read ఆడపిల్లకు జన్మనిచ్చిన ‘దిశ’ నిందితుడి భార్య...

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ రూరల్  జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి చిన్న తనంలోనే పోలియో బారిన పడింది. ఆమె మానసిక దివ్యాంగురాలు కూడా కావడం గమనార్హం. కాగా... సదరు యువతి ఇంట్లోలో ఎవరూ లేని సమయంలో కొలన్ పల్లి గ్రామానికి చెందిన ఎల్లస్వామి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అతనిని గమనించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా... బాధిత యువతి రక్తపు మడుగులో పడి ఉంది. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు యువకుడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.