కరీంనగర్ లోని మార్కండేయ కాలనీలో  కుటుంబ కలహలతో  భార్యను హత్య చేసి  ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.


కరీంనగర్: నగరంలోని మార్కండేయ కాలనీలో  కుటుంబ కలహాలతో  భార్యను  చంపి  ఆత్మహత్య చేసుకున్నాడు  భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం భార్య  లావణ్యను  భర్త ప్రవీణ్  హత్య చేశాడు.   భార్య మృతదేహన్ని ఇంట్లోనే దాచిపెట్టి  హస్టల్ లో ఉన్న  కూతురిని  చూసి వచ్చాడు.  ఇంటికి వచ్చిన తర్వాత  ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.