500 కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేసిన వ్యక్తి చిట్టచివరకు పెళ్ళాం చేతిలో చచ్చాడు. అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మరణించాడన్న సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. 

వివరాల్లోకి వెళితే....  చెన్నైకి చెందిన ప్రభాకరన్ అలియాస్ క్రిస్టి, సుకన్య ఇరువురు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. చెన్నైలో మనీ బ్యాక్ పాలసీ పేరుతో ఒక స్కీం ని నడిపి దాదాపు 500 కోట్ల మేర ప్రజలను మోసం చేసాడు. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రభాకరన్ 2012లో అరెస్ట్ అయ్యాడు. 8 నెలల అనంతరం బెయిల్ పై విడుదల అయ్యాడు. తమిళనాడు నుండి వచ్చి హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతంలో ఉంటున్నాడు . 

అతడి భార్య సుకన్యను 2013 లో అరెస్ట్ చేసారు. ఆమె 2018లో బెయిల్ పై విడుదల అయింది. వీరి పిల్లలు చెన్నైలో ప్రభాకరన్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. జైలు నుంచి విడుదలైన ఈమె భర్త ఆచూకీ తెలియక చంద్రగిరిలో బంధువుల ఇంట్లో పిల్లలతోపాటుగా ఉండసాగింది. 

భర్త మౌలాలీలో ఉంటున్నాడు అన్న విషయం తెలుసుకొని పిల్లలను తీసుకొని ప్రభాకరాన్ వద్దకు వచ్చింది. ప్రభాకరన్ భార్యతో కలిసి జీవించడానికి ఇష్టపడడంలేదు. ప్రభాకరన్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. 

భర్త వెనక్కి వెళ్లిపొమ్మనడంతో కోపగించుకున్న సుకన్య ప్రభాకరన్ ముఖంపై దిండుతో అదిమి చంపేసింది. అతడు చనిపోయిన తరువాత చుట్టుపక్కలవారికి అతడు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అని చెప్పింది. 

అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు పోలీసువారికి సమాచారం ఇవ్వగా, వారి విచారంలో తానే ప్రభాకరన్ ని చంపినట్టుగా తెలిపింది. ఆమెను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించారు పోలీసులు