చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..
గురువారం ఉదయం హైదరాబాద్ చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. చిక్కడపల్లిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాగ్ లింగంపల్లి దగ్గరి వీఎస్టీ సమీపంలోని ఓ గోడౌన్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ నుంచి దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదం సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
షార్ట్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే షాపు గౌడైన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు.