రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక (huzurabad bypoll) పోలింగ్ ముగిసింది. దీంతో విజేత ఎవరా అన్నదానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏ ఇద్దరూ కలిసినా దీనిపైనే చర్చ. ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు (betting) రంగంలోకి దిగారు. గెలుపు ఎవరదన్న దానిపై కోట్లలో పందేలు కాస్తున్నారు.  

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక (huzurabad bypoll) పోలింగ్ ముగిసింది. దీంతో విజేత ఎవరా అన్నదానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏ ఇద్దరూ కలిసినా దీనిపైనే చర్చ. ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు (betting) రంగంలోకి దిగారు. గెలుపు ఎవరదన్న దానిపై కోట్లలో పందేలు కాస్తున్నారు. హుజూరాబాద్, వరంగల్, కరీంనగర్‌ ప్రాంతాల్లోనే రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే ఫలితంపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

రాజకీయ నాయకులు, పార్టీలు, గెలుపు, మెజారిటీ.. ఇలా నాలుగు రకాలుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ (etela rajender) , గెల్లు శ్రీనివాస్‌ (gellu srinivas yadav) గెలుస్తాడని ఒక్కొక్కరిపై రూ.10 లక్షలు చొప్పున బెట్టింగ్‌లు కాస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ బెట్టింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ , గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌లు గెలుస్తారని రూ.3 కోట్లు బెట్టింగ్‌ కాసినట్లుగా సమాచారం. 

ALso Read:Huzurabad Bypoll: కారులో ఈవిఎంల తరలింపు వీడియో వైరల్... క్లారిటీ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి

ఈటల గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్న ఆయన అభిమానులు భారీగా పందేలు కాసినట్టు తెలిసింది. ఇక 35 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలుస్తారని కొందరు బెట్టింగ్‌ కాయగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ 25 వేల మెజారిటీతో గెలుస్తాడని మరికొందరు బెట్టింగ్‌ కాసినట్టు హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. మెజారిటీపై ఒక్క హుజూరాబాద్‌లోనే రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్‌ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

కొందరు ఏకంగా వాట్సాప్‌ గ్రూపు పెట్టి మరి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు వాట్సాప్‌ గ్రూప్‌లో 48 మంది ఉన్నారని తెలిసింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్న కొంతమంది బడా లీడర్లు కూడా బెట్టింగ్‌కు దిగినట్లుగా సమాచారం. కరీంనగర్‌లోని ఓ కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. బీజేపీ తరఫున గెలిచిన హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లలో కొందరు ఈటల 40 వేల మెజారిటీతో గెలుస్తారని రూ.10 లక్షల చొప్పున నలుగురు టీఆర్‌ఎస్‌ కార్పొరేట్లర్లతో బెట్టింగ్‌కు దిగినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలు, వివి ప్యాట్ లను తరలించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ పోలీసుల సహకారంతో అర్ధరాత్రి ఈవిఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందంటూ పుకార్లు జరుగుతున్నాయి. ఈ ప్రచారంపై హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. 

సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని... పనిచేయని వివి ప్యాట్ ను అఫీషియల్ వాహనం నుండి మరొక అఫీషియల్ వాహనములోకి మార్చి తరలించామన్నారు Huzurabad Returning Officer Ravinder Reddy. హుజరాబాద్ పోలింగ్ లో ఈ voter verifiable paper audit trail (VVPAT) వాడలేమని.... పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ వివి ప్యాట్ పనిచేయకపోవడంతో పక్కనపెట్టామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ వివి ప్యాట్ ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా గల రోడ్డుపై ఓ అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలోకి మార్చి గోదాంకు తరలించామన్నారు.