Asianet News TeluguAsianet News Telugu

Blast in Hyderabad: హైద‌రాబాద్ లో భారీ పేలుడు.. ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

Blast in Hyderabad: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.  ఈ ప్రమాదంలో ఇద్దరు వ్య‌క్తులు తీవ్ర గాయ‌ప‌డ్డారు.  క్షతగాత్రులను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. 
 

Huge Blast in Old Plastic Godown in Hyderabad Two Injured
Author
Hyderabad, First Published Dec 18, 2021, 8:47 PM IST

Blast in Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు (Blast in Hyderabad) సంభవించింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్, స్క్రాప్ గోడౌన్‌లో పేలుడు జ‌రిగింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల‌ను వెంట‌నే మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ పేలుడు ధాటికి ప్లాస్టిక్ గోడౌన్ కుప్పకూలిపోయింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గౌడౌన్ ఉంది. ఇందులో ప్లాస్టిక్ స్క్రాప్ ను రీసైకిల్ చేస్తారు. రోజులాగానే.. ప్లాస్టిక్ స్క్రాప్ చిన్న చిన్న‌ ముక్కలు చేస్తున్నారు.  ఈ క్రమంలోనే కెమిక‌ల్ డబ్బా మూత తీస్తుండ‌గా.. ఒక్క‌సారిగా భారీ పేలుడు జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు భ‌యాందోళ‌నకు గుర‌య్యారు. వెంటనే క్ష‌త‌గాత్రుల‌ను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి గోడౌన్ గోడలు కూడా కూలిపోయాయి. ఆ ప్లాస్టిక్ డబ్బా మూత తీయకుండా మెషీన్‌లో వేయడం... అందులో కెమికల్ ఉండటం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also:  ప్రకాశం : ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు.. బాధితులంతా విద్యార్ధులే

కాగా, ప్రమాద విష‌యం తెలియ‌గానే.. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేసుకున్నారు. ప్ర‌మాద స్థలాన్ని సంద‌ర్శించి.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పాత డబ్బాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్వాహకులను సూచించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్టాస్టిక్ స్క్రాప్ ఏరుకునే వ్యక్తి.. ప్లాస్టిక్ డబ్బా మూత తీయబోగా పేలుడు సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తికి  తీవ్ర గాయాల‌య్యాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 

Read Also: 65 ఏళ్లు.. 43 పుష్ అప్‌లు.. కాలేజీ ఫెస్ట్‌లో బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ హల్‌చల్

కృష్ణా జిల్లాలోని తోటవల్లూరు మండలం, గరికపర్రు లో విషాదం జ‌రిగింది.  ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పూరి గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికుల స‌మాచారం ప్ర‌కారం.. గరికపర్రు గ్రామానికి చెందిన మేకల వీరమ్మ ఇంట్లో గ్యాస్ లీకై మంట‌లు చెల‌రేగాయి. ఈ క్ర‌మంలో గుడిసెకు మంటలు అంటున్నాయి. దీంతో ఆమె భయపడి తన బిడ్డను తీసుకుని బయటకు పరుగెత్తింది. ఇంతలోనే గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. 

Read Also: ఏపీ: 24 గంటల్లో 137 మందికి కరోనా.. గోదావరి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

దీంతో ప‌క్క‌నే ఉన్న గుడిసెలను  మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలార్పేందుకు ప్ర‌య‌త్నించిన ఫ‌లితం లేకుండా పోయింది. నిమిషాల్లో గుడిసెలు కాలి బుడిద‌య్యాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించివుడొచ్చని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios