హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా..?

హైదరాబాద్‌లో శుక్రవారం భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. ఈ మొత్తం రూ.కోటిపైనే వుంటుందని సమాచారం. దీనికి సంబంధించి జుమ్మేరాత్ బజార్ వద్ద నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

huge amount of hawala cash seized in hyderabad

హైదరాబాద్‌లో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. ఈ మొత్తం రూ.కోటిపైనే వుంటుందని సమాచారం. శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు.. ఈ క్రమంలో జుమ్మేరాత్ బజార్ వద్ద నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద భారీగా డబ్బు వెలుగుచూసింది. సొమ్ముకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారి నుంచి కారు, నగదును స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు. నిందితులను కమలేశ్, అశోక్ కుమార్ , రతన్ సింగ్, రాహుల్ అగర్వాల్‌గా గుర్తించారు. వీరంతా దొడ్డిదారిలో సంపాదించేందుకు హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరి కోసం ఈ డబ్బును తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎవరికైనా అందించేందుకు ఈ సొమ్మును తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అంతకుముందు ఈ నెల 12న కూడా పెట్టుబడుల పేరుతో  హవాలా  రాకెట్ ను నడిపిన 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తైవాన్ కు చెందిన చున్యూ, చైనాకు చెందిన జాక్ ఈ ముఠాలో కీలక పాత్రధారులని సీపీ చెప్పారు. ఈ కేసులో పుణెకు చెందిన వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేస్తే చైనాకి చెందిన జాక్ హస్తం బయటపడిందని ఆనంద్ తెలిపారు. ఈ మోసాన్ని ఈడీ లాంటి సంస్థలు కూడా గుర్తించలేవన్నారు.  ఈ  మోసంపై ఈడీ, డీఆర్ఐ అధికారులను దర్యాప్తు చేయాలని కోరుతామని సీవీ ఆనంద్ చెప్పారు.

ALso REad:చెత్త వ్యాపారి ఇంట్లో రూ.1.24 కోట్లు.. షాకైన పోలీసులు

ఈ ముఠా మోసానికి ఎందరో గురయ్యారన్నారని తమ దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు. చైనా దేశస్తుడి ఆదేశాలతోనే తాము ఈ  మోసానికి పాల్పడినట్టుగా పుణెకి చెందిన వీరేందర్ సింగ్ చెప్పాడని కమీషనర్ అన్నారు. నిందితులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఎలాంటి రికార్డులు లేకుండానే వర్చువల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశం నుండి  వందల కోట్లను చైనాకు తరలించినట్టుగా గుర్తించినట్టుగా సీవీ ఆనంద్ వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios