Asianet News TeluguAsianet News Telugu

చెత్త వ్యాపారి ఇంట్లో రూ.1.24 కోట్లు.. షాకైన పోలీసులు

హైదరాబాద్‌లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్  పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంకులో పరిధిలో షోయబ్ అనే స్క్రాప్ వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

Hyderabad police seize Rs 1.24 cr cash from scrap dealer
Author
First Published Sep 30, 2022, 10:16 PM IST

హైదరాబాద్‌లో రూ.1.24 కోట్ల హవాలా డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్  పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంకులో పరిధిలో షోయబ్ అనే స్క్రాప్ వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతని స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్. ఇతను హైదరాబాద్‌కు వచ్చి పాత సామాన్లను సేకరించే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గుజరాత్ గల్లీకి చెందిన భరత్ అనే వ్యక్తి నుంచి షోయబ్ ఈ నగదు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో అతని నివాసంలో తనిఖీలు నిర్వహించి రూ.1.24 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios