హైదరాబాద్: జస్టిస్ ఫర్ హేమంత్ పేరుతో  అవంతితో పాటు ఆమె స్నేహితులు ఆందోళనతో చందానగర్ లో  సోమవారం నాడు సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. 
ఈ నెల 24వ తేదీన హేమంత్ ను అవంతి కుటుంబసభ్యులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.ఈ హత్యను నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

also read:హేమంత్ మర్డర్: నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

హేమంత్ సోదరుడు సుమంత్, హేమంత్ భార్య అవంతి, బంధువులు, స్నేహితలు ఆందోళనలో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ కూడ ఈ కార్యక్రమంలో పాల్గొని తన మద్దతును ప్రకటించారు.

హేమంత్ ఇంటి నుండి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి వైపుకు నిరసనకారులు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. హేమంత్ హత్య విషయంలో పోలీసుల వైఫల్యం కన్పిస్తోందన్నారు.తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని జూన్ 16 తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.