హైదరాబాద్:చందానగర్ లో పరువు హత్య కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేసేందుకుగాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో  నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 24వ తేదీన హేమంత్ కుమార్ ను కిడ్నాప్ చేసి అదే రోజు రాత్రి అవంతి బంధువులు హత్య చేశారు. ఈ ఘటనపై హేమంత్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 25వ తేదీన యుగంధర్ రెడ్డి సహా 12 మందిని అరెస్ట్ చేశారు.

కులాంతర వివాహం చేసుకొన్న అవంతిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే హేమంత్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు ప్రకటించారు. నెల రోజుల ముందే ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

also read:కాళ్లు చేతులు కట్టేసి కారులోనే హత్య: హేమంత్ మర్డర్ కేసుపై పోలీసులు

ఈ కేసుకు సంబంధించిన ఇంకా కీలక విషయాలను సేకరించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దరిమిలా నిందితులను కస్టడీని కోరుతూ సోమవారం నాడు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.