యాదాద్రి భువనగిరి జిల్లాలో రామకృష్ణ అనే హోంగార్డు హత్యకు గురయ్యాడు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యను పోలీసులు పరువు హత్యగా భావిస్తున్నారు.
భువనగరి :యాదాద్రి భువనగిరి జిల్లాలో రామకృష్ణ అనే Home Guardను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ హత్యను honour killingగా అనుమానిస్తున్నారు. Siddipet జిల్లాలో Ramakrishna మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. రామకృష్ణను కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం రామకృష్ణను కిడ్నాపర్లు Hyderabad కు పిలిపించి ఆ తర్వాత హత్య చేశారని అనుమానిస్తున్నారు.
2020 లో Bhargavi అనే యువతిని రామకృష్ణ ప్రేమించి Marriage చేసుకొన్నాడు. ఈ వివాహం భార్గవి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయితే భార్గవితో కలిసి భువనగరిలోనే నివాసం ఉంటున్నాడు. గుప్త నిధుల కేసులో రామకృష్ణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో రామకృష్ణ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే రెండు రోజలు క్రితం నుండి రామకృష్ణ కన్పించకుండా పోయాడు. దీంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే రెండు రోజుల క్రితం నిందితులు రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని రామకృష్ణ పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.
రామకృష్ణ మామ వీఆర్‌ఓ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం రామకృష్ణను హైద్రాబాద్ కు పిలిపించి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణ హత్యలో రౌడీషీటర్ లతీఫ్ తో పాటు మరో ముగ్గురు మహిళల పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
యాదగిరిగుట్టకు చెందిన భార్గవిని, వలిగొండ మండలం లింగరాజుపల్లెకు చెందిన రామకృష్ణ 2020 ఆష్టు 16న ప్రేమ వివాహం చేసుకొన్నాడు. స్వంత గ్రామం లింగరాజుపల్లెలోనే భార్యతో రామకృష్ణ నివాసం ఉన్నాడు. అయితే భార్గవి గర్భవతి కావడంతో తరచూ ఆసుపత్రికి వెళ్లడానికి వీలుగా తన నివాసాన్ని భువనగిరికి మార్చాడు.
ఇటీవలనే భార్గవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తుర్కపల్లి గుప్తనిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ కు గురయ్యారు. దీంతో రామకృష్ణ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణను లతీఫ్ అనే రౌడీషీటర్ భూమిని చూపించాలని పిలిపించి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. రామకృష్ణ మామ వెంకటేష్ సూచనలతో లతీఫ్ అతని గ్యాంగ్ రామకృష్ణను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు.
నెల రోజులుగా రామకృష్ణపై లతీఫ్ నిఘా
రామకృష్ణపై లతీఫ్ నెల రోజులుగా నిఘాను ఏర్పాటు చేశారు. ప్లాట్ కొనుగోలు చేస్తానని లతీఫ్ రామకృష్ణను నమ్మించాడు. ఈ విషయమై కొంత నగదును కూడా రామకృష్ణకు లతీఫ్ పంపాడు. దీంతో ఫ్లాట్ చూపిస్తానని రామకృష్ణ చెప్పారు. రామకృష్ణను హైద్రాబాద్ పిలిపించి కిడ్నాప్ చేసి రామకృష్ణను లతీఫ్ హత్య చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. లతీఫ్ ద్వారా రామకృష్ణను చంపేందుకు వెంకటేష్ సుఫారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.
