తెలంగాణలో భారీ వర్షాలు: విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున  సోమవారం నుండి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.ఈ విషయమై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Holidays Declared Holiday For all Educational institutions From July 11 to 13 In Telangana

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Heavy Rains నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని Educational institutions కు  సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం KCR ప్రకటించారు.రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కరిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు పొంగిపొర్లుతుంది.  రాష్ట్రంలోని ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసాలో జనావాసాల్లో వరద నీరు ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైద్రాబాద్ లో కూడా వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నీలిచింది.

వర్షాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ సహా ఇతర అధికారులతో రెండు రోజుల క్రితం మాట్లాడారు. అధికారులంతతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రులు జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కూడా కోరారు.  రాష్ట్రంలోని అధికారులతో వరద సహాయక చర్యలపై సీఎస్ సోమేషన్ కుమార్ అధికారులతో సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

also read:Telangana Rains: తెలంగాణలో కుండపోత.. ఆ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..

 భారీ వర్షాలు కురుస్తుండంతో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. వర్సపు నీరు చేరడంతో ఓపెన్ కాస్టుల్లో విధులకు అంతరాయం ఏర్పడుతుంది. సింగరేణి వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరి నదిలో వరద నీరు రావడంతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పలు మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని కూడా అధికారులు ప్రజలను కోరుతన్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలెర్ట్ లు జారీ చేసింది. దేశంలోని ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. .
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios