Hyderabad: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది అధికార యంత్రాంగం. అనుమతులు లేకుండా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్యభవనాల, ఇత‌ర నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు. దీని కోసం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, మున్సిపల్, పోలీసుల సహకారంతో హెచ్ఎండిఏ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తోంది. మొదటిరోజు పది అక్రమ  నిర్మాణాల కూల్చివేశారు.  

Hyderabad: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది అధికార యంత్రాంగం. అనుమతులు లేకుండా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్యభవనాల, ఇత‌ర నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు అధికారులు. దీని కోసం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, మున్సిపల్, పోలీసుల సహకారంతో హెచ్ఎండిఏ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తోంది. మొదటిరోజు పది అక్రమ నిర్మాణాల కూల్చివేశారు. Hyderabad Metropolitan Development Authority ప‌రిధిలోని అక్ర‌మ కూల్చివేత స్పెషల్ డ్రైవ్ ఇంకా కొన‌సాగుతుంద‌ని అధికారులు తెలిపారు. 

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండిఏ) పరిధిలోని అక్రమ భవన నిర్మాణాల కూల్చివేత‌కు సంబంధించిన స్పెష‌ల్ డ్రైవ్ లో భాగంగా హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విద్ కుమార్.. HMDA పరిధిలోని నాలుగు ప్ర‌త్యేక‌ టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలోనే గత కొన్ని రోజులుగా ఆ టీమ్ లు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా హెచ్ఎండీఏ అధికారులు, ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం కార్యరంగంలోకి దిగి అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్యభవనాల, ఇత‌ర నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు. ముందుగా 600 చదరపు గజాలకు మించి ఉన్న పది అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు ప్రారంభించాయి.

సోమ‌వారం నిర్వ‌హించిన HMDA పరిధిలో అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్యభవనాల, ఇత‌ర నిర్మాణాల కూల్చివేత స్పెష‌ల్ డ్రైవ్ లో Hyderabad Metropolitan Development Authority డైరెక్టర్లు, ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండిఎ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీంలు, స్థానిక మున్సిపాలిటీ కమిషనర్లు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. వీరంద‌రూ ద‌గ్డ‌రుండి మ‌రీ అక్ర‌మ నిర్మాణాలను నేలమ‌ట్టం చేయించారు. 

హెచ్‌ఎండీఏ( Hyderabad Metropolitan Development Authority) పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు గ‌త కొంత కాలంగా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే గ‌త నెల 30 (డిసెంబ‌ర్) వరకు సంబంధిత మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించడంతోపాటు కూల్చివేతపై సమగ్ర నివేదికివ్వాలని ప్రభుత్వం సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ప‌లువురు అధికారుల‌పైనా చ‌ర్య‌లు సైతం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే Hyderabad Metropolitan Development Authority ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాలు గుర్తించ‌డానికి నాలుగు ప్ర‌త్యేక‌ టీమ్ లను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ఆ టీమ్ లు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపాలిటీలవారీగా అక్రమ నిర్మాణాల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది. ఈ క్ర‌మంలోనే సంబంధిత మున్సిపాలిటీల్లో దాదాపు 2 వేల వరకు అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. Hyderabad Metropolitan Development Authority పరిధిలో అత్యధికంగా మణికొండ, ఆదిబట్ల, బండ్లగూడ మున్సిపాలిటీల్లో ఉన్నట్లు తేల్చారు. ఈ క్ర‌మంలోనే అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను షురూ చేశారు అధికారులు. అక్ర‌మంగా నిర్మించిన అపార్ట్‌మెంట్లు, వాణిజ్యభవనాల, ఇత‌ర నిర్మాణాల కూల్చివేత స్పెష‌ల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.