హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత  ఆయన అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

హైద్రాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.