Tahsildar Vijaya: ప్రత్యేక అధికారి నియామకం.. విజయారెడ్డి హత్య ముందు సురేష్..

నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను ఆయన విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సురేష్ తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

higher officials Appointed ACP Jayaram For Tahsildar Vijayareddy Murder case

తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు కోసం ప్రత్యేకంగా విచారణాధికారిని నియమించారు. విచారణాధికారిగా వనస్థలీపురం ఏసీపీ జయరాంని నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా... విజయారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా గాయాలపాలైన సంగతి తెలిసిందే.

AlsoRead విజయారెడ్డి అంత్యక్రియల్లో...సీఎం కేసీఆర్ కి చేదు అనుభవం...

60శాతం గాయాలపాలైన సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి రాచకొండ పోలీసులు వెళ్లనున్నారు. ఇప్పటికే నిందితుడు సురేష్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సురేష్ కి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను ఆయన విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలంలో సురేష్ తోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా..విజయారెడ్డి హత్యకేసులో మరిన్ని నిజాలు బయటకు వెలుగు చూస్తున్నాయి. ఆఫీసులో సెక్యురిటీ పెంచాలని నెల క్రితమే విజయా రెడ్డి కలెక్టర్ ని కోరినట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూములపై ఆందోళన పెరగుతుండటంతో.. గతంలోనే విజయారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సురేష్ కి చెందిన 9 ఎకరాల భూమిని మాజీ ప్రజాప్రతినిధికి అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన రోజు సురేష్ చాలా మందితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు.  సురేష్ కాల్ లిస్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం. 

AlsoRead వెనుక గేటు నుండి వచ్చి ఎమ్మార్వో విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన సురేష్...

హత్య చేసిన తర్వాత పక్కనే ఉన్న ఓ కారులోని వ్యక్తితో సురేష్ మాట్లాడినట్లు గుర్తించారు. కాగా.. సురేష్ ఎవరితో మాట్లాడాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా...సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కూడా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. నిందితుడు సురేష్ కూడా 60శాతం గాయపడగా... అతను ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు. భూ వివాదంలో తహసీల్దార్ తనకు మద్దతు ఇవ్వనందుకే చంపేసినట్లు సురేష్ అంగీకరించాడు. కాగా.. సురేష్ వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios