తెలంగాణ సాంస్కృతిక సారధికి హైకోర్టు షాక్: మళ్లీ నియామకాలు చేపట్టాలని ఆదేశం

Highcourt orders to re recruitment jobs in Telangana sanskrita saradi
Highlights

తెలంగాణ సాంస్కృతిక సారధిలో నియామకాల విషయంలో అక్రమాలు చోటుచేసుకొన్నాయనే పిటిషన్ పై హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేసింది. రెండు వారాల్లో నోటిపికేషన్ జారీ చేసి మూడు వారాల్లో కొత్త నియామకాలను చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారధిలో కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నియామకాలను చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తెలంగాణ సాంస్కృతిక సారధిలో నియామకాల విషయంలో  అవతవకలు చోటుచేసుకొన్నాయనే విషయమై  పిటిషనర్  కోర్టును ఆశ్రయించారు. దీంతో  కోర్టుఈ మేరకు మంగళవారం నాడు ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

 తెలంగాణ సాంస్కృతిక సారధిలో 550 మంది కళాకారులకు ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకొంది.  కళాకారుల నియామకాల్లో  అవతవకలు చోటు చేసుకొన్నాయని  కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.

రెండు వారాల్లో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు తెలంగాణ సాంస్కృతిక సారధికి ఆదేశాలు జారీ చేసింది.  మూడు వారాల్లోపుగా నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించింది.  

తెలంగాణ సాంస్కృతిక సారధిలో నియామకాల సమయంలో అవతవకలు చోటు చేసుకొన్నాయని ఆ సమయంలో  విమర్శలు వెల్లువెత్తాయి. అర్హులైన వారికి  సారధిలో చోటు దక్కలేదని కొందరు కళాకారులు విమర్శలు చేశారు. అయితే  ఈ విమర్శలను తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్మెన్  రసమయి బాలకిషన్ ఖండించారు.

అర్హులైన  వారందరికీ  ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తాజాగా హైకోర్టుఇచ్చిన తీర్పుపై తెలంగాణ సాంస్కృతిక సారధి  ఛైర్మెన్ రసమయి బాలకిషన్,  తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందో చూడాలి.


 

loader