Asianet News TeluguAsianet News Telugu

పాతబస్తీలో ఉద్రికత్త.. భారీగా పోలీసుల మోహరింపు.. రాజాసింగ్ ప్రవక్తపై వ్యాఖ్యల ఎఫెక్ట్..

రాజాసింగ్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో బుధవారం ఉదయం ఉద్రికత్త నెలకొంది. దీంతో అవాంఛనీయ పరిస్థితులు చెలరేగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

high tension in old city over bjp mla raja singh prophet remarks in hyderabad
Author
Hyderabad, First Published Aug 24, 2022, 8:38 AM IST

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది బిజెపి. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలో నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్ కు బెయిల్ దొరికింది. ఈ నేపథ్యంలో భారీగా యువత ఓల్డ్ సిటీలోని రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

పాతబస్తీలో రోడ్ల పైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్దసంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మొగల్పురాలో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో హైటెన్షన్ నెలకొంది.  పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి పంపించివేశారు.

పోలీసులకు షాక్.. రాజాసింగ్ రిమాండ్‌‌ను రిజెక్ట్ చేసిన కోర్ట్, విడుదలకు ఆదేశం

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్ కు వెళ్లే రోడ్డు మూసేసి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్ బేగంబజారులోని చత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజా సింగ్ ను అరెస్టు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్క ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీనిని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించాల్సి ఉండగా రాజాసింగ్ వ్యాఖ్యలు,  ఆయన అరెస్టుతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ కామెంట్స్ పై ఎంఐఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం.. పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో అధికారులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా వేగంగా అడుగులు వేస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios