నేనూ డాక్టర్‌నే.. 20 లక్షల బిల్లు ఎందుకైంది: ప్రైవేట్ ఆసుపత్రిని నిలదీసిన మృతుడి చెల్లి
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోగుల నుంచి డబ్బులు దోచుకుంటున్నాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుందంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడో వ్యక్తి
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోగుల నుంచి డబ్బులు దోచుకుంటున్నాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుందంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడో వ్యక్తి. అయితే 9 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు దాదాపు రూ. 20 లక్షల బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఒత్తిడి చేశారు.
Also Read:నిలువు దోపిడికి చెక్: కరోనా మృతులకు ఉచిత అంతిమయాత్ర వాహనాలు, జీహెచ్ఎంసీ నిర్ణయం
మృతుడి చెల్లెలు డాక్టర్ కావడంతో ఆమె బంధువులతో కలిసి ఆ ఆసుపత్రి నిర్వాహకులను నిలదీసింది. 20 లక్షల బిల్లు ఎలా అయ్యిందో చెప్పాలని గట్టిగా అడిగింది. దాంతో రూపాయి కూడా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని మృతదేహాం తీసుకెళ్లొచ్చని చెప్పారు. అలాంటప్పుడు 20 లక్షల బిల్లు వేశారని గొడవకు దిగారు. కోపంతో ఆసుపత్రిపై దాడికి దిగారు.