నిలువు దోపిడికి చెక్: కరోనా మృతులకు ఉచిత అంతిమయాత్ర వాహనాలు, జీహెచ్ఎంసీ నిర్ణయం

నగరంలో శ్మశానవాటికలు, అంబులెన్స్‌లు ప్రజల అవసరాన్ని అదనుగా చేసుకుని అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఈ దందాకు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ghmc introduce last rites vehicles ksp

నగరంలో శ్మశానవాటికలు, అంబులెన్స్‌లు ప్రజల అవసరాన్ని అదనుగా చేసుకుని అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఈ దందాకు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌తో మృతి చెందినవారికి బల్దియా ఆధ్వర్యంలో ఉచిత అంతిమయాత్ర వాహనాలను ఏర్పాటు చేశారు.

నగరంలోని ఆరు జోన్లలో 14 వాహనాలను అందుబాటులో ఉంచారు. డీసీఎం వ్యాన్‌లను అంతిమయాత్ర వాహనాలుగా మార్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించామని... వాహనం కావాల్సినవారు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే 15 నిముషాల్లో వాహనం వస్తుందని పేర్కొన్నారు. అలాగే శ్మశానాల్లో కూడా రేటు ఫిక్స్ చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read:కోవిడ్ మృతుల అంత్యక్రియలు.. శ్మశానాల్లో నిలువు దోపిడి, రంగంలోకి జీహెచ్ఎంసీ

కరోనా నేపథ్యంలో స్మశాన వాటికల్లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. గతంలో రోజుకు ఒకటి రెండు మృతదేహాలు వచ్చే చోట.. కోవిడ్ పుణ్యమా అని రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలు స్మశానానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వసూలు చేయాలని శ్మశాన వాటికల వద్ద ధరలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని శ్మశాన వాటికల్లోనూ ఒకే విధంగా రుసుములు వుండాలని నిర్ణయించిన బల్దియా ఈ మేరకు చర్యలు తీసుకుంది.

సాధారణ మృతుల అంత్యక్రియలకు రూ.6 వేలు.. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.8 వేలు వసూలు చేయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా అధిక ధరలు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios