Asianet News TeluguAsianet News Telugu

కాలేయ దాతకు ‘ హై రిస్క్ బీటింగ్ హార్ట్ బైపాస్ ’ సర్జరీ: కేర్ వైద్యుల ఘనత

హైదరాబాద్ బంజారాహిల్స్‌ కేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలోని బృందం కాలేయ దానం చేసి జీవించి వున్న 71 ఏళ్ల వృద్ధుడికి ఈ శస్త్రచికిత్సను చేసింది

high risk beating heart bypass surgery done by care hospital
Author
Hyderabad, First Published Oct 7, 2020, 4:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ బంజారాహిల్స్‌ కేర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలోని బృందం కాలేయ దానం చేసి జీవించి వున్న 71 ఏళ్ల వృద్ధుడికి ఈ శస్త్రచికిత్సను చేసింది.

సయ్యద్‌ ఇషాక్‌ అనే పెద్దాయన 1998వ సంవత్సరంలో తన కాలేయంలోని ఎడమ వైపు భాగాన్ని తన సోదరుడికి న్యూఢిల్లీలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో దానం చేశారు. ఈ శస్త్రచికిత్సను అప్పట్లో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం చేశారు.

కాలేయ దానం చేసిన తర్వాత సయ్యద్ తన సాధారణ జీవితాన్ని పున: ప్రారంభించారు. మహారాష్ట్రంలోని అకోలా వద్ద ఉన్న ఓ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం 14 విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఓ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సయ్యద్‌ను గుండె జబ్బులు చుట్టుముట్టాయి. 2000, 2010, 2012 సంవత్సరాలలో పూణేలో ఆయన కరోనరీ ఆర్టరీస్‌కు స్టెంటింగ్ చేయించుకున్నారు. అలా మొత్తం మీద ఆరు స్టంట్‌లను వేయించుకున్నారు. 

ఇటీవల మరోసారి గుండెపోటు వచ్చింది. కరోనరీ యాంజియోగ్రఫీ సూచించిన దాని ప్రకారం స్టెంట్‌లలోనూ బహుళ బ్లాక్స్‌ కనబడ్డాయి. ఆయన ప్రాణాలు కాపాడాలంటే అత్యవసరంగా బైపాస్‌ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. 

బహుళ బైపాస్‌ శస్త్రచికిత్సలను ఈ నెల 1న డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌ నేతృత్వంలోని బృందం బీటింగ్‌ హార్ట్‌ విధానాన్ని అనుసరించి మొత్తం ధమనులను వ్యాప్తి చేశారు. కాళ్లకు ఎలాంటి కోతలనూ చేయలేదు.

శస్త్రచికిత్స తరువాత ఆయన త్వరగా కోలుకోవడంతో పాటు రెండు రోజులలోనే తిరిగి నడువడం ప్రారంభించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడటంతో సయ్యద్‌ను బుధవారం డిశ్చార్జ్‌ చేశారు.

దీనిపై డాక్టర్‌ ప్రతీక్‌ భట్నాగర్‌మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలో ప్రధానమైన అంశం ఏమిటంటే కాలేయ పనితీరు అని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీటింగ్‌ హార్ట్‌ శస్త్రచికిత్స విధానంను తాము అనుసరించినట్లు ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా ఇదే విధానాన్ని ఆయన తన రోగులకు అనుసరిస్తుంటారు. ఈ కారణం చేత ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సను నిరోధించడంతో పాటుగా మొత్తం బైపాస్‌ శస్త్రచికిత్సను గుండెను ఆపడం లేదా కోత కోయడం చేయకుండా నిర్వహిస్తారు. అందువల్ల, ఈ మొత్తం శస్త్రచికిత్సలో కాలేయం పల్సలైట్‌ రక్త ప్రవాహం అందుకుంటుంది. ఇది కాలేయ పనితీరును గరిష్టంగా ఉండేటట్లు చేస్తుంది. 

డాక్టర్‌ భట్నాగర్‌ వెల్లడిండిన దాని ప్రకారం ఈ శస్త్రచికిత్సలో కొన్ని వినూత్నమైన అంశాలు ఉన్నాయి. మొదటగా, ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సతో పోలిస్తే పల్సలైట్‌ ఫ్లో కలిగిన బీటింగ్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలో కాలేయం లాంటి అవయవాలకు అత్యుత్తమ రక్షణ కలుగుతుంది.

ఎందుకంటే కాలేయాన్ని సయ్యద్ కొంత దానం చేశారు. రెండవది, తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన తరువాత కూడా రోగి ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. ఇది అవయవదానం చేస్తే తమకు ఏమవుతుందో అన్న భయంతో ఉండే చాలామందికి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.

మరీ ముఖ్యంగా కాలేయ దానం లాంటి కేసులలో ఇది మరింత మందికి భరోసా కలిగిస్తుంది. ఒకవేళ కాలేయ దాతకు తరువాత కాలంలో అతి క్లిష్టమైన గుండె వ్యాధులు, ఈ రోగిలో కనిపించినట్లుగా కనిపిస్తే, వారు అప్పటికి కూడా విజయవంతంగా బైపాస్‌ శస్త్రచికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంతో చేయించుకోవచ్చు.

అందువల్ల అవయవదానం చేసిన రోగులు శస్త్రచికిత్స చేయించుకోవడంలో భయపడాల్సిన పనిలేదు. వారు తిరిగి తమ ఆరోగ్యం పొందగలరు. సమయానికి, సరైన రీతిలో చేసిన బైపాస్‌ శస్త్రచికిత్స ఎల్లప్పుడూ కూడా రోగులకు ఉపయుక్తంగానే ఉంటుంది. సయ్యద్‌ కేర్ ఆస్పత్రిలో సెప్టెంబర్‌‌ 30న చేరారు.

కేర్ హాస్పిటల్స్ గ్రూప్ కింద భారతదేశంలోని 5 రాష్ట్రాల్లోని 6 నగరాల్లో 12 ఆసుపత్రుల ద్వారా సేవలందిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios