Asianet News TeluguAsianet News Telugu

గురుకుల పరీక్షలకు లైన్ క్లియర్

  • గురుకుల ఉపాద్యాయ పరీక్షలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు
  • జిఓ నెం.1274 అమలులో  తప్పేమి లేదని నిర్ణయం
  • ప్రభుత్వానికి ఊరటనిచ్చిన తాజా తీర్పు
high court stay cancelled on gurukul teachers exams

 
గురుకుల ఉపాద్యాయ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గురుకులాల్లో మహిళా అభ్యర్థులకు సింహభాగం పోస్టులు ఇచ్చేవిధంగా వెలువరించిన జిఓ నెం.1274పై హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత తెలంగాణ  ప్రభుత్వం, టిఎస్పిఎస్సి కౌంటర్ దాఖలు చేశాయి. అనంతరం ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నోటిఫికేషన్ లో  పేర్కొన్న అంశాలు లింగ వివక్షను సమర్థించేలా ఉందన్న వాదనను న్యాయస్థానం తాజా తీర్పులో తోసిపుచ్చింది. 
జిఓ నెంబరు 1274 ఆధారంగా ఇచ్చిన నోటిఫికేషన్ల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు పురుష అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ ఆయా గురుకుల పాఠశాలలు, కళాశాలలన్నీ రెసిడెన్సియల్ కాబట్టి అక్కడ రాత్రి వేళల్లో విధుల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందని, అందుకోసమే మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులుగా నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపింది సర్కారు.
దీనిపై తదుపరి విచారణ చేపట్టిన హైకోర్టు తన నిర్ఱయాన్ని వెలువరుస్తూ బాలికల గురుకులాలకు మాత్రమే ఈ నిభందన వర్తిస్తుంది కావున దీన్ని తప్పుపట్టలేమని నిర్ణయించింది . గురుకులాల్లోనే  బాలికల హాస్టళ్లు కూడా  ఉండనున్నందున పురుషులను ఉపాద్యాయులుగా నియమించరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 
దీంతో గురుకుల టీచర్ల పరీక్షలపై అభ్యర్థులకున్న అనుమానాలు పటాపంచలై, మళ్లీ పుస్తకాలతో కుస్తీకి సిద్దమవుతున్నారు. మెయిన్స్ పరీక్షలు రాసిన వాళ్లు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్ష రాయకుండా వాయిదా పడ్డ వారంతా పరీక్ష కోసం చదువుతున్నారు. ఇప్పటికే అనేక  నియామకాల విషయంలో పెండింగ్ లో ఉన్న కేసులు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతుండడంతో ప్రభుత్వం కూడా ఊపిరిపీల్చుకుంటోంది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో తదుపరి పరీక్షల తేదీలను కసరత్తు చేసి టిఎస్ పిఎస్సీ వెలువరించే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios