హైదరాబాద్:   టీఆర్ఎస్‌లో  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేరిన విషయమై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ సాగింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీలు పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ప్రభాకరరావు, సంతోష్‌కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.  

ఈ విషయమై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని శాసనమండలి ఛైర్మెన్, శాసనమండలి కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం టీఆర్ఎస్‌లో విలీనం చేయడం చట్ట విరుద్దమని కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?