హైదరాబాద్: చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ను సోమవారం నాడు మంజూరు చేసింది.

ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లను బంధించిన కేసులో ఆయనకు అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఈ అరెస్ట్ వారంట్‌పై  నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది.

నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించడంతో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు  కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అంతేకాదు పోలీసు విచారణకు సహకరించాలని కూడ హైకోర్టు విశ్వేశ్వర్ రెడ్డిని ఆదేశించింది. అంతేకాదు రూ.25 వేల  చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

ఇంకా అజ్ఞాతంలోనే: హైకోర్టుకెక్కిన కొండా విశ్వేశ్వరరెడ్డి

అజ్ఞాతంలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి: అరెస్టుకు రంగం సిద్ధం