హైదరాబాద్: చేవేళ్ల ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రె్డి ముందస్తు బెయిల్ కోసం  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.

ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేశారనే కేసులో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. అయితే ఈ అరెస్ట్ వారంట్ జారీపై నాంపల్లి కోర్టును కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు.పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ  ఇంతవరకు ఆయన ఆచూకీని మాత్రం కనిపెట్టలేదు. 
 

సంబంధితవార్తలు

అజ్ఞాతంలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి: అరెస్టుకు రంగం సిద్ధం