హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  ముందస్తు బెయిల్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులపై దాడి చేసినందున అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది.వారం రోజులుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయింది. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాంపల్లి కోర్టులో  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం నాడు నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కొండా బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

చేవేళ్ల ఎంపీ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది  అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ను వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏగా ఉన్న ఓ వ్యక్తి నుండి భారీగా నగదును కూడ పోలీసులు ఎన్నికలకు ముందు స్వాధీనం చేసుకొన్నారు.