Asianet News TeluguAsianet News Telugu

పొలం గట్టు తవ్వుతుంటే దొరికిన లో గుప్తనిధులు.. పంపకంలో తేడాలతో...

ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి దగ్గర ఉన్న పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలం గట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. 

Hidden treasures found in a farm land at nalgonda
Author
Hyderabad, First Published Dec 30, 2021, 12:28 PM IST

నల్గొండ : nalgonda, రామన్నపేటలోని మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో Hidden treasures లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నబోయిన మల్లయ్య సర్వే నంబర్ లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర (గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి. 

మట్టిపాత్రలో 38 silver coins, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు (విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుపపెట్టెలో 19 gold coinలు (పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణాలమీద ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసి గట్టును ఆనుకుని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు. 

అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి దగ్గర ఉన్న పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలం గట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్ చేశాడు. వరినాట్లు ముగిసిన రెండు రోజుల తరువాత సోదరులిద్దరూ గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు. 

Hyderabad: డోర్ కూడా తీసుకోలేనంత ఫుల్లుగా మందు తాగి... కారులో చిక్కుకుని వ్యక్తి మృతి

సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలు రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిజామాబాద్ లో గురువారం ఉదయం కలకలం రేగింది. Nizamabad జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద హైదరాబాద్-నాగ్ పుర్ జాతీయ రహదారి మీద బుధవారం Torn currency(నోట్ల తుక్కు) కుప్పలు కుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. లారీ నుంచి కిందపడిన సంచి పై నుంచి వాహనాలు వెళ్లడంతో తుక్కు రోడ్డు మీద చెల్లా చెదురుగా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

అవి అసలైనవా? నకిలీ నోట్లా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘సాధారణంగా RBI పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. 

హైద్రాబాద్‌ రాజేంద్రనగర్‌లో దారుణం: టెన్త్ క్లాస్ విద్యార్ధినిపై యువకుడి అత్యాచారం

దీన్ని బట్టి అది black moneyనో లేదా counterfeit noteలు అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నాం’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios