తనకు అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తానని టాలీవుడ్ నటి, ఆ రోజుల్లో.. ఫేమ్ రేష్మా రాథోడ్ చెప్పారు. మహబూబాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. 

హైదరాబాద్‌ : తనకు అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తానని టాలీవుడ్ నటి, ఆ రోజుల్లో.. ఫేమ్ రేష్మా రాథోడ్ చెప్పారు. మహబూబాబాద్ లోకసభ స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. తనను యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. 

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమిస్తే తప్పకుండా వినియోగించుకుంటానని ఆమె అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున ఆమె బీజేపీలో చేరారు. ప్రజల సమస్యలతో పాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన హారితహారం, డబుల్‌ బెడ్రూమ్‌, ఇతర పథకాల అమలు సరిగా లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. 12,751 గ్రామ పంచాయతీలకుగానూ కేవలం 3,494 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులను నియమించారని గుర్తుచేశారు.

హరితహారం క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని అన్నారు.