తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని అరే.. ఒరే అని పిలిచే ఏకైక మహిళా నేత ఎవరు అన్న ప్రశ్నను ఏషియానెట్ లేవనెత్తింది. దీనిపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయితే ఏషియానెట్ లేవనెత్తిన చర్చలో వందల మంది స్పందించారు. వేల మంది ఈ వార్తను చదివారు. స్పందించిన వందలాది మందిలో 99 శాతం మందికిపైగా సరైన సమాధానం గుర్తించలేకపోయారు.

సోషల్ మీడియోలో స్పందించిన వారిలో కేవలం ఒకశాతం మంది మాత్రమే సరైన సమాధానం గుర్తించారు. అసలు విషయాన్ని దాచిపెట్టి రెండో పార్ట్ స్టోరీలో వెల్లడిస్తామని చెప్పినందుకు కొందరు సరదగా తీసుకున్నారు. ఇంకొందరు కోపమొచ్చినా వేచిచూద్దాం ఏం చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. ఒకరో ఇద్దరో కొంచెం ఘాటుగా కూడా స్పందించారు. అయితే ఎక్కువ మంది ఏషియా నెట్ వార్తను ఫాలో అయిన వారు ఆమెను గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ గా కామెంట్ చేశారు. మెజార్టీ సంఖ్యలో డికె అరుణ పేరునే సూచించారు. ఇంకొందరేమో సబితా ఇంద్రారెడ్డి పేరును చెప్పారు. మరికొందరు భువనగిరి నాయకురాలు ఉమామాధవరెడ్డి పేరును కూడా తెలియజేశారు. కానీ ఆ మూడు పేర్లు కూడా సరైన సమాధానం కాదనే విషయాన్ని గుర్తించగలరని మనవి చేస్తున్నాం.

రేవంత్ రెడ్డిని అరే ఒరే అని పిలిచే చనువు, చొరవ డికె అరుణ కు కానీ, సబితా ఇంద్రారెడ్డికి కానీ లేవు. సబితా ఇంద్రారెడ్డి రేవంత్ కు బంధువులు అయినప్పటికీ ఆమె పబ్లిక్ గా ఎప్పుడూ అరే అని పిలిచిన దాఖలాలు లేవు. అయితే డికె అరుణతో రేవంత్ కు ఎప్పటినుంచో వైరం ఉంది. పలుసందర్భాల్లో వారిద్దరూ తిట్టుకున్నారు కానీ.. ఆమె అరే, ఒరే అనలేదు. ఇక ఉమామాధవరెడ్డి కూడా అంత చనువుతో ఏం పిలిచిన దాఖలాలు లేవు.

మహబూబ్ నగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డిని పబ్లిక్ లో అరే.. ఒరే అని పిలిచే చనువు ఉంది. అయితే ఆమె రేవంత్ రెడ్డికి ఏరకంగా చూసినా బంధువు కాదు. కాకపోతే గతంలో జడ్పీ ఛైర్మన్ గా సీతాదయాకర్ రెడ్డి పనిచేసిన కాలంలో రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి జడ్పీటిసి అయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. అయితే రేవంత్ రాజకీయాల్లోకి రాకముందే కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబంతో సన్నితంగా ఉండేవాడు. అప్పటినుంచే కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిని అరే ఒరే అని సంబోధించేవారు. రాజకీయాల్లో అటు వారి కుటుంబం, ఇటు రేవంత్ కూడా ఉన్నతస్థాయికి చేరారు. ఎమ్మెల్యేలు అయ్యారు. అయినప్పటికీ  వారి మధ్య ఆ సబంధం ఇంకా అలాగే ఉంది. అయితే రేవంత్ రెడ్డి కొత్తకోట దయాకర్ రెడ్డిని అన్నా అని సంబోధిస్తారు. సీతాదయాకర్ రెడ్డిని అక్కా అని పిలుస్తారు.

గత నెలరోజులక్రితం రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో అసెంబ్లీలో సీతాదయాకర్ రెడ్డి అక్కడ మీడియా ప్రతినిధులు, అసెంబ్లీ సిబ్బంది అందరూ ఉండగానే అరే రేవంత్ అంటూ సంబోధించారు. దీంతో మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కొత్తకోట దంపతులు ఇంకా టిడిపిలోనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ రిలేషన్ అలాగే కొనసాగుతుందా? రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన చిన్ననాటి బంధుత్వాలు మారుతాయా అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.

ఏది ఏమైనా వేలాది మంది ఏషియానెట్ ప్రచురించిన పార్ట్ 1 స్టోరీని, పార్ట్ 2 స్టోరీని చదివి స్పందించినందుకు, ఆదరించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నాము. 

 

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి వార్తతోపాటు

మరిన్ని తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/4h1Qxh