దిక్కు మొక్కు లేక హరికృష్ణ ప్రమాదంలోని క్షతగాత్రులు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 31, Aug 2018, 11:29 AM IST
Help for us urges anneparthy road accident victims
Highlights

నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద టీడీపీ నేత హరికృష్ణ కారు ఢీకొనడంతో గాయపడిన  ముగ్గురు  ఫోటోగ్రాఫర్లు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు


నల్గొండ: నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద టీడీపీ నేత హరికృష్ణ కారు ఢీకొనడంతో గాయపడిన  ముగ్గురు  ఫోటోగ్రాఫర్లు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హరికృష్ణ కారు ఫోటోగ్రాఫర్లు ప్రయాణీస్తున్న కారును ఢీకొనడంతో  వీరు గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద  ఆగష్టు 29వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  టీడీపీ నేత హరికృష్ణ మృతి చెందాడు. హరికృష్ణ ప్రయాణీస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి  ఎదురుగా ఉన్న రోడ్డు గుండా ప్రయాణీస్తున్న హైద్రాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్లు ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టింది.

ఈ కారులో  చెన్నై నుండి హైద్రాబాద్‌కు ఫోటో గ్రాఫర్లు తిరిగివస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో తృటిలో ముగ్గురు ఫోటో గ్రాఫర్లు తప్పించుకొన్నారు.  స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

 హరికృష్ణ నడుపుతున్న కారు  ఇంకా స్పీడ్‌గా ఈ కారును ఢీ కొడితే ఈ కారులోని వారి ప్రాణాలకు కూడ ముప్పు వాటిల్లేదేమోననే అనుమానాలు కూడ లేకపోదు.అయితే ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు కూడ  ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

హరికృష్ణతో పాటు ఈ ముగ్గురు ఫోటోగ్రాఫర్లను కూడ నార్కట్‌పల్లిలో కామినేని ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఆసుపత్రిలోనే వారు చికిత్స పొందుతున్నారు. అప్పులు చేసి  కొనుగోలు చేసిన కెమెరాలు ధ్వంసమయ్యాయని ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు.  


ఈ వార్తలు చదవండి

హరికృష్ణ మృతి: రాత్రి ఒకటిన్నరకు నిద్ర లేపాలని అడిగారు

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

loader