తెలంగాణలో వచ్చే ఐదు రోజులు ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు
Hyderabad: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Telangana Rains: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
వివరాల్లోకెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, నారాయణపేట, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండలో 65.5 మిల్లీ మీటర్లు, మంచిర్యాలలో 58.3 మిల్లీ మీటర్లు, కుమరం భీంలో 50.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 48 గంటల పాటు నగరంలో ఉదయం వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి దిశగా పయనిస్తోందనీ, రానున్న రెండు రోజుల్లో జార్ఖండ్ మీదుగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అంతకుముందు, వాతావరణ శాఖ తన బులిటెన్ లో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో బుధవారం నుంచి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గాలులు తమ గమనాన్ని మార్చుకోవడంతో రాష్ట్రంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ వాసులు, ముఖ్యంగా ఆయా ప్రాంతాల ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు.