దంచి కొడుతున్న వాన.. నేడు కూడా అతిభారీ వర్షాలు...పలు జిల్లాలు ఆరెంజ్ అలర్ట్..

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నాడు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. 

heavy rains, orange and yellow alert issues IMD in telangana districts - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగారెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా, మంగళవారం నాడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం రాత్రి వరకు పడుతూనే ఉంది. పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచ్చిప్పలో 15.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. వీటితోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురిసాయి.

Fake Baba: దెయ్యాన్ని వదిలిస్తానని నవ వధువుపై అత్యాచారం.. కీచక బాబా అరెస్ట్

మరోవైపు రాజధాని హైదరాబాదులోనూ వర్షం దంచి కొట్టింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో సోమవారం పగలు 10 సెంటీమీటర్ల వర్షం కురవగా… సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో 8.9 సెంటీమీటర్లు… కొండాపూర్ లో 8.8 సెం.మీ, మెదక్ జిల్లా  చిలిప్ చేడ్ 7.6సెం.మీ., వికారాబాద్ జిల్లా మొమింపేటలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్, ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్ పల్లి, సిరికొండలలో భారీగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు రోడ్లు కోతకు గురయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని కప్పలవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని మండలాల్లో వంతెనల పై నుంచి రాకపోకలను నిలిపేశారు.

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకొండ, గాంధారి, బిక్కనూరు, బీబీపేట, రాజంపేటలలో కూడా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. 

ఇదే విధంగా మంగళవారం నాడు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు చేసింది. 

ఆరంజ్ హెచ్చరికలు జారీ అయిన జిల్లాలు వరుసగా.. మంచిర్యాల,  నిజామాబాద్,  జగిత్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ములుగు, జనగామ, హనుమకొండ,  వరంగల్ లలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పరివాహక ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా ప్రవాహం మొదలయ్యింది. నిజామాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారంనాడు  శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద మొదలైంది. వరద ప్రవాహం మొదలవడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరిచారు.

కడెం ప్రాజెక్టుకు కూడా వరద మొదలైంది. ఇప్పటికే 33 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ లకు… మానేరు వాగు, ఇతర స్థానికంగా ఉన్న వాగుల నుంచి ప్రవాహం పోటెత్తుతుంది.

వరద మరీ పోటెత్తకుండా మేడిగడ్డ నుంచి దిగువకు 1.66 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం దగ్గర కూడా గోదావరిలో నీటిమట్టం పెరిగింది. 36.81 మీటర్ల నీటిమట్ట నమోదవడంతో.. 78,663 క్యూసెక్కుల ప్రవాహం నదిలో కొనసాగుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios