Fake Baba: దెయ్యాన్ని వదిలిస్తానని నవ వధువుపై అత్యాచారం.. కీచక బాబా అరెస్ట్

Fake Baba: మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యాల్ని వదిలిస్తానని చెప్పి అత్తామామల్ని నమ్మించాడు కీచక బాబా. అనంతరం.. వారిని బయటే ఉండమని చెప్పి మహిళపై అత్యాచారం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

fake baba arrested at bandlaguda in hyderabad KRJ

Fake Baba: శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొంతమంది నేడు దయ్యాలు భూతాలు అంటూ మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. తాజా దయ్యం పట్టుకుందని నమ్మించి ఓ నవ వధువు పై ఓ కీచక బాబా దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ ఆలం ప్రాంతానికి చెందిన ఓ యువతకి మూడు నెలల క్రితం వివాహమైంది.

అయితే వివాహానంతరం ఆ యువతి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను పలు ఆసుపత్రుల వెంబడి తిప్పారు కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె అత్త మామ బండ్లగూడలోని మజార్ ఖాన్ అనే ఓ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ యువతిని చూసిన ఆ బాబా ఆమెకు దయ్యం పట్టిందని వారిని నమ్మించాడు. ఆమెకు పట్టిన దయ్యాన్ని తాను వదిలేస్తానని అత్తమామలకి చెప్పాడు. తమ కోడల్ని మీరే కాపాడాలంటూ బాబుతో చెప్పారు. దీంతో వారిని బయటే ఉండమని ఆ వివాహితను గదిలోకి తీసుకెళ్లాడు. అందరం ఆమె కనులకు గంతలు కట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటూ బెదిరించాడు.

కానీ ఆ మహిళ ఆ దారుణాన్ని తన అత్త మామలకు చెప్పింది. కానీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అవివాహిత తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితున్ని ఎట్టకేలకు పట్టుకొని అరెస్ట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios