Asianet News TeluguAsianet News Telugu

వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం: పరిగిలో లోతట్టు ప్రాంతాలు జలమయం

వికారాబాద్ జిల్లాలో పరిగిలో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో బీసీ కాలనీలో వరద నీరు చేరింది. అంతేకాదు మార్కెట్ రోడ్డులో భారీగా వరద నీరు చేరింది. మరో వైపు రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. 
 

Heavy rains lash Vikarabad District
Author
Hyderabad, First Published Aug 4, 2022, 5:18 PM IST

వికారాబాద్: Vikarabad జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అంతేకాదు వికారాబాద్ -Parigi మధ్య రాకపోకలు బందయ్యాయి. రెండు మూడు రోజులుగా వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది జూలై 25, 26 తేదీలలో భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజులుగా వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నెల రెండో తేదీ నుండి వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలకు బందయ్యాయి. ఈ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద పోటెత్తుతుంది.

వికారాబాద్ జిల్లాలోని పరిగిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిగి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో ముంపునకు గురయ్యాయి. పరిగి బీసీ కాలనీలో భారీగా చేరిన వరద నీరు చేరింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

Telangana రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  వార్నింగ్ ఇచ్చింది. ఈ రోజుతో పాటు  రేపు తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాక వార్నింగ్ ఇచ్చింది. కనీసం 40 నుండి 50 గంటల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్ ఘడ్  నుండి తెలంగాణ మీదుగా  శ్రీలంక వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది.  

also read:వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం: పలు చోట్ల తెగిన రోడ్లు, రాకపోకలు బంద్

మరో వైపు Andhra Pradesh రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా బుఁధవారం నాడు రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల్లోని నదులకు వరద పోటెత్తింది.

Follow Us:
Download App:
  • android
  • ios