హైదరాబాద్: హైద్రాబాద్ లో గురువారం నాడు పలు చోట్ల భారీ వర్షం కురిసింది.  ఈ వర్షం కారణంగా  పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.

హైద్రాబబాద్ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుండి పలు చోట్ల వర్షం కురుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరుకొంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.

సాయంత్రం ఒక్కసారిగా వర్షం పెద్దదికావడంతో ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది.

 ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌, కాటేదాన్‌ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా  ట్రాఫిక్ జాం అయి  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.