తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు

Hyderabad: తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల పాటు వాన‌లు ప‌డ‌తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేశారు. ఇక ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో వాన‌లు ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.  
 

Heavy rains in several parts of Telangana for next 3 days, Says IMD RMA

Telangana rains: తెలంగాణ‌లో రానున్న మూడు రోజుల పాటు వాన‌లు ప‌డ‌తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేశారు. ఇక ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో వాన‌లు ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. వాతావరణంలో మార్పు ఉంటుందనీ, రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎండీ అధికారులు పేర్కొన్నారు. 

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 3 తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో స‌మ‌యానికి వాన‌లు ప‌డ‌క‌పోవ‌డంతో పంట‌లు ఎండిపోతున్నాయిని ప‌లువురు రైతులు వాపోతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర్షాలు.. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో నాలుగు రోజుల పాటు ప‌లు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని స‌మాచారం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios