తెలంగాణకు భారీ వర్ష సూచన.. జంటనగరాల్లో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
Hyderabad: రానున్న కొన్ని గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇప్పటివరకు జైనూర్ (కుమరంభీం జిల్లా)లో 13 సెంటీమీటర్లు, వాంకాడి (కుమరంభీం), ఉట్నూర్ (ఆదిలాబాద్)లో 12 సెంటీమీటర్లు, తాడ్వాయి (ములుగు)లో 11 సెంటీమీటర్లు, నర్సంపేట (వరంగల్), కెరమెరి (కుమరంభీం), సిరుపూరు, కోటపల్లి (మంచిర్యాల)లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Heavy rain forecast for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న కొన్ని గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు జైనూర్ (కుమరంభీం జిల్లా)లో 13 సెంటీమీటర్లు, వాంకాడి (కుమరంభీం), ఉట్నూర్ (ఆదిలాబాద్)లో 12 సెంటీమీటర్లు, తాడ్వాయి (ములుగు)లో 11 సెంటీమీటర్లు, నర్సంపేట (వరంగల్), కెరమెరి (కుమరంభీం), సిరుపూరు, కోటపల్లి (మంచిర్యాల)లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అలాగే, హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షాలు కురవడంతో జంటనగరాల్లో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 28.5 డిగ్రీలు, సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా, కనిష్ఠంగా 21.9 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి , హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు (6.4 సెంటీమీటర్ల వరకు) వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) తన నివేదికలో పేర్కొంది.
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు (1.5 సెంటీమీటర్ల వరకు) కురిశాయి. జీహెచ్ఎంసీలో గత 24 గంటల్లో అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 6 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు పడకపోవడంతో మున్ముందు పరిస్థితులు ఎలా వుంటాయోనని దిగులుపడుతున్నారు.