Telangana rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తిన వానలు
Heavy rains: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అలాగే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Update: ప్రస్తుతం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి మరిన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. రెండు రోజుల పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగాం, యాదాద్రి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చిరించింది. అలాగే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం సమీపంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరంగల్ జిల్లా కల్లెడలో రాష్ట్రంలోనే అత్యధికంగా 14.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, గురువారం రాత్రి 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లాలోని పరకల్, వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామాల్లో 12.15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. గతంలో వరంగల్ జిల్లాలో తొమ్మిది ఇతర ప్రాంతాల్లో 7.9 సెంటీ మీటర్ల నుంచి11.55 సెంటీ మీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైంది.ఇక హన్మకొండలోని కాకతీయ జూపార్కు సమీపంలోని మారుతీహిల్స్ కాలనీ జూ పార్కు గుండా నాలా పొంగి ప్రవహించడంతో చుట్టుపక్కల మొసళ్లను గుర్తించామని వాసులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి.