ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత‌.. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోన్న మూసీన‌ది

Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ క్ర‌మంలోనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఉప్పొంగి.. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ కాజ్వే వద్ద మూసీ నదిలో నీటిమట్టం వంతెనను తాకూడు ప్ర‌వ‌హిస్తోంది.
 

heavy rainfall: Osman Sagar and Himayat Sagar gates have been lifted, Musi River swells RMA

Telangana rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంది. ఈ క్ర‌మంలోనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఉప్పొంగి.. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ కాజ్వే వద్ద మూసీ నదిలో నీటిమట్టం వంతెనను తాకూడు ప్ర‌వ‌హిస్తోంది.

మిగులు జలాలను విడుదల చేసేందుకు అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నాలుగు గేట్లను ఎత్తివేయడంతో మూసీ నది మట్టం పెరుగుతోందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. నదీమట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, వివిధ శాఖల అధికారుల సూచనలను పాటించాలని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచించారు. మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ కాజ్‌వే వద్ద మూసీ నదిలో నీటిమట్టం వంతెనకు చేరుకోవడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు ప్రాంతాలతో పాటు జియాగూడ, పురానాపూల్, దుర్గానగర్, సరూర్‌నగర్ వాసులను కూడా అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా, నీటి ఎద్దడి కారణంగా అధికారులు ORR ఎగ్జిట్ 2, 7లను మూసివేశారు.
 

ఇదిలావుండ‌గా, వారం రోజులకు పైగా కురిసిన భారీ వర్షాలకు గత రెండు రోజుల్లో నగరంలో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు కొండచిలువలు కనిపించగా, నాలుగింటిని రక్షించారు. పురానాపూల్ వద్ద చెత్తాచెదారంతో నిండిన వరద నీటిలో ఒక పెద్ద కొండ‌చిలువ తిరుగుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

జూలై 27న కూకట్ పల్లిలో రోడ్డు దాటుతున్న మరో కొండచిలువ ఫొటో వైర‌ల్ అవుతోంది . ప్రగతి నగర్ సమీపంలో కనిపించిన కొండచిలువకు సంబంధించిన మరో ఫొటోను కూడా యూజర్లు షేర్ చేయగా, ఈ రెండు ఒకే సరీసృపానికి చెందినవి అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios