హైద్రాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఉదయం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Heavy rainfall lashes in Hyderabad

హైదరాబాద్: Hyderabadలో ని పలు ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఉదయం భారీ వర్షం కురుస్తుంది..లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

Telangana లో రుతుపవనాలు ప్రవేశించిన రోజు నుండి Rains  ప్రారంభమయ్యాయి. అయితే మధ్యలో కొన్ని రోజుల పాటు వర్షాలు కొంత తెరిపిని ఇచ్చాయి. అయితే ఇటీవల కాలంలో దాదాపు వారం రోజులకు పైగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, ఎల్ బీ నగర్, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, కొత్తపేట,జూబ్లీహిల్స్ , లింగంపల్లి, టోలిచౌకి, మణికొండ, ఉప్పల్, అంబర్ పేట, రామంతాపూర్, బోయిన్ పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్,  ఖైరతాబాద్, ఆబిడ్స్, నాంపల్లి, కోఠి, బషీర్ బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలుప్రాంతాల్లో వర్షం నీరు వచ్చి చేరుతుంది.  వర్షం కారణంగా రోడ్లపై వర్షం నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి వర్షం కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేశారు అధికారులు. 

తెలంగాణపై అల్పపీడన ప్రభావం ఉండడంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు భారీ గా వరద చేరుకొంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ తరుణంలో మరోసారి వర్షాలు కురుస్తుండడంతో మరింతగా ప్రాజెక్టుల్లోకి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఆయా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు అధికారులు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios