హైద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షం: లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లు

హైదరాబాద్ నగరంలో బుధవారం నాడు ఉదయం కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో రోడ్లపైనే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 

Heavy rain lashes parts of Hyderabad, several areas waterlogged

హైదరాబాద్: Hyderabad నగరంలో పలు ప్రాంతాల్లో బుధవారం నాడు ఉదయం కురిసిన Rain  లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. Vehicle రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వర్షం నీరు  చేరింది. 

నైరుతి రుతుపవనాలు Telangana  రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకువచ్చాయి. సోమవారం నాడు రాత్రి  హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.  ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ నెల 14న కూడా హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్ం చేశారు. అయితే వర్షపాతం నమోదు కాలేదు. కానీ బుధవారం నాడు ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. గంటకి పైగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

నగరంలోని పాతబస్తీలో గల ఛత్రినాక, శివగంగా నగర్, శివాజీ నగర్ లలో వరద నీరు రోడ్లపై పొంగిపొర్లింది. దీంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మణికొండలో కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరో రెండు రోజుల పాటు హైద్రాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెం.మీ. వర్షం నమోదైంది. అత్యల్పంగా సింగపూర్ టౌన్ షిప్ దగ్గర 5.6 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రానికి పశ్చిమదిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఈ ఏడాది మే 31న హైద్రాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో  ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో  ల్యాండింగ్ కావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు.  వాతావరణంలో మార్పుల వల్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి - హైదరాబాద్, ఢిల్లీ- హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు మళ్లించారు. అలాగే పాట్నా- హైదరాబాద్ విమానం విజయవాకు మళ్లించారు. 

నగరంలోని  మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట్‌, బాలాపూర్, గుర్రంగూడ‌, ఎల్బీన‌గ‌ర్‌, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ , ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, నాచారం ప‌రిధిలోనూ వ‌ర్షం కురిసింది. దీంతో ఉద‌యం నుంచి ఉక్క‌పోత‌కు గురైన ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. మరోవైపు అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీని ధాటికి ఆలయ గోపురం పై భాగం ధ్వంసమైంది. పిడుగుపడిన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

also read:Heavy Rains: ఈశాన్య భార‌తంలోకి రుతుపవనాలు.. అసోం, మేఘాలయలో భారీ వర్షాలు !

ఈ ఏడాది మే 4న హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. . కొన్నిచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చార్మినార్, మలక్‌పేట్, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లలో హోర్డింగ్స్ కూలిపోయాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బాబా నగర్, పిస్సల్ బండ, యాకత్‌పురాలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉప్పల్, రామంతాపూర్‌లలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios