Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ను వణికించిన జడివాన.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్,  రాజేంద్రనగర్,  కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.  

Heavy rain in hyderabad, traffic jam in hyderabad-bangalore highway
Author
Hyderabad, First Published Oct 9, 2021, 10:13 AM IST

హైదరాబాద్ తోపాటు శివార్లలో శుక్రవారం heavy rains కురిశాయి.  హైదరాబాద్ నగరంలో దాదాపు గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.  ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పొడి వాతావరణం ఉన్నా... రాత్రి 7:30 గంటలకు ఓ మోస్తారుగా ప్రారంభమైన వర్షం క్రమంగా ఉధృతంగా మారింది.  

దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్,  రాజేంద్రనగర్,  కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.  

కుర్మగూడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సరూర్ నగర్ మండలం  లింగోజిగూడ ప్రాంతంలో  రికార్డు స్థాయిలో 13 సెంటీమీటర్లు,  నందిగామ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11.35 సెంటీమీటర్లు,  మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9.03 సెంటీమీటర్లు,  హయత్ నగర్ మండలం సౌత్ హస్తినాపురం ప్రాంతంలో  8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. 

హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం...(వీడియో)

సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్-జిహెచ్ఎంసి ప్రాంతంలో 8.58 సెంటీమీటర్లు,  మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మారుతీనగర్ లో 8.5 సెంటీమీటర్లు,  నాచారంలో 8.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  కాగా హైదరాబాదులోని ఓల్డ్ ఉస్మాన్‌ఘంజ్‌, మహరాజ్‌ఘంజ్‌ మార్కెట్లలో దుకాణాలు నీట మునిగిపోయాయి.

వాతావరణ కేంద్రం లో నిలిచిపోయిన ‘రాడార్’

హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ‘Radar’ సేవలు నిలిచిపోయాయి.  ఈనెల ఆరో తేదీన కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిక్ స్విచ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయింది.  కరెంటు  మెయిన్ కు  అనుసంధానంగా ఉన్న స్విచ్ బోర్డు, ఫ్లగ్గులు, వైర్లు మాడిపోయాయి. దీంతో ‘రాడార్’కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మూడు రోజులుగా ఇంజనీర్ తో మరమ్మతు పనులు చేయిస్తున్నా పని పూర్తి కాలేదు. IMDలో రాడార్ పనిచేయకపోవడంతో మూడు రోజులుగా వాతావరణ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రత్యామ్నాయంగా శాటిలైట్ నుంచి వాతావరణ సమాచారం సేకరిస్తున్నామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె నాగరత్న తెలిపారు.  శనివారం నాటికి రాడార్ సేవలు పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు. 

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.

నగరంలో గతరాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్-బెంగళూరు రహదారిమీద వరదనీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్-బెంగళూరు మార్గంలో భారీగా traffic jam ఏర్పడింది. 

రహదారికి ఇరువైపులా 3 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరాంఘర్-శంషాబాద్ రహదారిమీద కూడా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios